"మా తెనుగు తల్లి కి మల్లెపూదండ!"

"మా తెనుగు తల్లి కి మల్లెపూదండ!
మా కన్నతల్లికి మంగళారతులు!
మా తెనుగు తల్లి కి మల్లెపూదండ!

కడుపు లో బంగారు...కనుచూపులో కరుణ!
కడుపు లో బంగారు...కనుచూపులో కరుణ!
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి!
మా తెనుగు తల్లి కి మల్లెపూదండ!

గలగలా గోదారి కదలిపోతుంటేను
గలగలా గోదారి కదలిపోతుంటేను...
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను!
బంగారు పంటలే పండుతాయి
బంగారు పంటలే పండుతాయి...
మురిపాల ముత్యాలు దొరలుతాయి!
మా తెనుగు తల్లి కి మల్లెపూదండ!

అమరావతీ గుహల అపురూప శిల్పాలు
అమరావతీ గుహల అపురూప శిల్పాలు...
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు...
నిత్యమై నిఖిలమై నిలిచిఉండేదాక!

రుద్రమ్మ భుజశక్తి...
మల్లమ్మ పతిభక్తి...
తిమ్మరసు ధీయుక్తి,కృష్ణరాయని కీర్తి!

మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక...
నీ పాటలే పాడుతాం!
నీ ఆటలే ఆడుతాం!
జై తెనుగు తల్లీ! జై తెనుగు తల్లీ!

- శంకరంబాడి సుందరాచారి.

No comments: