ఫనా...వినాశనం!!!

"ఫనా"... ఎంత చక్కటి చిత్రం! ఎన్నోరోజుల తర్వాత ఇంత మంచి రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూశాను.ఈ సినిమా ను తప్పక చూడండి.సినిమా ప్రథమార్థంలో ఒకరికొకరు ప్రాణాలిచ్చుకొనే ఇద్దరు ప్రేమికులు ద్వితీయార్థంలో ఎదురుబొదురుగా నిల్చొని ఒకరికొకరు రివాల్వర్ గురిపెట్టుకొనే సన్నివేశం చిత్రానికే తలమానికం లాంటిది.షిబాని భతీజా కథ,చిత్రానుసరణ(స్క్రీన్ ప్లే),కునాల్ కోహ్లీ దర్శకత్వం,సంభాషణలు అద్భుతం.ప్రసూన్ జోషి సాహిత్యం,జతిన్-లలిత్ సంగీతం బంగారానికి తావి అబ్బినట్లు చక్కగా సమకూరాయి.రితేష్ సోనీ కూర్పు,రవిచంద్రన్ ఛాయాచిత్రలంకరణ భేష్.ఇక అమీర్ ఖాన్,కాజోల్ ల నటన గురించి చెప్పేదేముంది,ఒక్కమాట లో చెప్పాలంటే...చించేసారు!

3 comments:

Sweety Maruth said...

dats d gud one !!!!

i wanna 2 c tht movie ...but heard it hvent playing well ..neways gud post in TELUGU ;-)

చదువరి said...

చింతు గారూ! ఆర్కుట్ ఆహ్వానం పంపించాను. అందింది కదా!

శ్రీనివాసరాజు said...

లేదండీ నాకు నచ్చలేదు ఆ సినిమా.. కధాంశం ఉన్నంతగా.. స్క్ర్రీన్ ప్లే లేకపోవడం వలన డ్రామాటిక్ గా ఉంది. మన 80 ల సినిమాలా అనిపించింది.. కానీ, హీరో నెగెటివ్ కేరక్టరైసేషన్ నచ్చింది..అదే తెలుగులో ఐతే..హీరో ఎటువంటి కధలోనైనా చచ్చిపోతే.. సినిమా ప్లాప్..