స్వస్తి శ్రీ మదపార పారావార పరివ్రుత మహీ
తలంబున సకలజన వినుతంబగు నంధ్రదేశంబు
నకు విభూషణంబైన యనుమకొండయను పురవ
రంబు నిజరాజధానిగా నొప్పుచుంన్న కాకెతె భూపా
ల క్రమంబున జనవినుత యశో విలాసుండును వి
జయ లక్ష్మీనివాసుండునునై నరుద్ర నరేంద్ర సు
పుత్రుండును సదారాధిత త్రినేత్రుండును వి
బుధజన వన వసంతుండును రమణియ్య సీమ
ంతిని జయంతుండును సకలజన మనోరంజ
నుండును నరాతిరాజమద భంజనుండును శరణా
గతరాజ శరణ్యుండును వినుతాఖిల రాజవరే
ణ్యుండును ధైయ్యా ్మర సానుమంతుడునుం దు
రగ రేవంతుడును సత్యహరిశ్చంద్రుండును
విభవామరేంద్రుండును నైన గణపతిదేవమ
హీనాథునకుం బ్రధానియై //క// కనకాచలధీరు
ండు జనవినుత చరిత్రుండు గాయ్య ్విదుం డినతే
జుం డనఘుండు గుణనిధి బెజ్జమ తనయుండు
బుధ దీన భానుతనయుండనగాంన్ //వ్రి// ప్ర
తిపక్ష క్షితిపాల కుంజర మద ప్రారంభ సంర
ంభముద్ధత బాహానిహిత ప్రచండ నిశితోద్య
త్ఖడ్గ ధారా నఖాహతి భేదించి యఖవ్వ
గవ్వ ్బంశౌయ్య ్స్ఫూతిం ్గంఠీరవా
కృతియై సన్నుత వ్రిత్తిదాల్చి వెలసెను రే
చెల్ల రుద్రుండిలన్//
- కాకతీయుల ఉప్పరపల్లి శిలాశాసనము.
దాత: కాకతీయ గణపతి దేవుని సామంత సేనాపతి రాజనాయకుడు.
శాసనకాలము: క్రీ.శ.1236
{గాజుల సత్యనారాయణ విరచిత 'తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష' నుంచి}
2 comments:
దీనికి అర్థమేంటో!
--ప్రసాద్
http://blog.charasala.com
స్వస్తి శ్రీ మదపార పారావార పరివ్రుత మహీతలంబున సకలజన వినుతంబగు నంధ్రదేశంబునకు విభూషణంబైన యనుమకొండయను పురవరంబు నిజరాజధానిగా నొప్పుచుంన్న కాకెతె భూపాల క్రమంబున జనవినుత యశో విలాసుండును విజయలక్ష్మీనివాసుండునునై నరుద్ర నరేంద్ర సుపుత్రుండును సదారాధిత త్రినేత్రుండును విబుధజన వన వసంతుండును రమణియ్య సీమంతిని జయంతుండును సకలజన మనోరంజనుండును నరాతిరాజమద భంజనుండును శరణాగతరాజ శరణ్యుండును వినుతాఖిల రాజవరేణ్యుండును ధైయ్య ్మర సానుమంతుడునుం దురగ రేవంతుడును సత్యహరిశ్చంద్రుండును విభవామరేంద్రుండును నైన గణపతిదేవమహీనాథునకుం బ్రధానియై //క// కనకాచలధీరుండు జనవినుత చరిత్రుండు గాయ్య ్విదుం డినతే జుండనఘుండు గుణనిధి బెజ్జమ తనయుండు బుధ దీనభానుతనయుండనగాంన్ //వ్రి// ప్రతిపక్ష క్షితిపాల కుంజర మద ప్రారంభ సంరంభముద్ధత బాహానిహిత ప్రచండ నిశితోద్యత్ఖడ్గధారా నఖాహతి భేదించి యఖవ్వగవ్వ ్బంశౌయ్య ్స్ఫూతిం ్గంఠీరవా కృతియై సన్నుత వ్రిత్తిదాల్చి వెలసెను రేచెల్ల రుద్రుండిలన్//
ఇలా చదివితే కొంత వరకు అర్థమవుతుంది.ఆ శాసనంలోని వాక్యాలను అదే రీతిలో పెట్టాలని అలా రాశాను.
ఇక దీని భావమేమంటే 'రాజనాయకుడ'నే సేనాపతి, కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని ప్రధానమంత్రి అయిన 'రేచెర్ల రుద్రుడి' గురించి ప్రస్తుతిస్తూ వేయించిన శాసనం అని నేను అనుకొంటున్నాను.విజ్ఞులెవరైనా నా ఊహ తప్పైతే తెలియజేయగలరు!
మొదటి 14 వాక్యాల వర్ణన అంతా గణపతిదేవుని గురించి, తరువాతి 10 వాక్యాలు రేచెర్ల రుద్రుడి గురించి చెప్పారు/చెక్కారు!
Post a Comment