దేశభాషలందు తెలుగు లెస్స!

మీకో విషయం తెలుసా?

"దేశభాషలందు తెలుగు లెస్స" అన్నది శ్రీకృష్ణదేవరాయలు కాదు! అవును ఇది నిజం!
రాయలు కళింగ ప్రాంతం పై దండయాత్రలు చేస్తున్నప్పుడు ఇప్పటి విజయవాడ దగ్గరున్న శ్రీకాకుళమహావిష్ణువు ఆలయాన్ని సందర్శించాడు. ఆ 'ఆంధ్ర మహావిష్ణువు' రాజు కలలో కనబడి శ్రీరంగంలో జరిగిన తన పెళ్ళి గురించి వ్రాయమని తుళు మాతృభాషగా గల రాయలవారిని ఆదేశించే క్రమంలో 'అముక్తమాల్యద'లో ప్రసిద్ధిగాంచిన ఈ పద్యం వస్తుంది:

"తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ తెలుగొకండ,
ఎల్లనృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స!"
(అముక్తమాల్యద-శ్రీకృష్ణదేవరాయలు)

అంటే ఈ పదాలను ఆంధ్ర మహావిష్ణువు కలలో కనపడి రాయలతో అన్నాడన్న మాట.
కర్తృత్వం మాత్రం శ్రీకృష్ణదేవరాయలిదే అనుకోండి.

"ఓ రాజా! తెలుగు లో ఎందుకు రాయాలని అంటే నీవు పాలిస్తున్నది తెలుగు దేశాన్ని(అన్నగారు రాజకీయాల్లో ప్రవేశించినపుడు తెలుగుదేశం' అనే పేరును ఎన్నుకోవడం ఫై ఈ పద్యం ప్రభావం ఖచ్చితంగా ఉండి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం), నేనేమో ఓ తెలుగు రాజును ( ఆంధ్రమహావిష్ణువు కూడా ఓ రాజని అతని పాలన గొప్పదనం వల్ల ప్రజలు ఆయనకో ఆలయాన్ని నెలకొల్పారని చరిత్ర చెబుతోంది)నీవు తెలుగులో మాట్లాడుతావు కాబట్టి నిన్ను మిగతా అందరు రాజులు కొలుస్తారు,సంస్కృతం కాక మిగతా భాషల్లో/ఈ ప్రాంతంలో మాట్లాడే అన్ని భాషలకన్నాతెలుగు గొప్పది"

అందులో ఇంకో మాట కూడా ఉందండోయ్!
" నేను తెలుగు రాజును, నీవేమో కన్నడ రాజువు!" అని కూడా అన్నాడట విష్ణువు.
ఇది రాయల గారి ఉవాచ!

ఏదేమైనా తెలుగంటే వీరాభిమానమున్న రాజుగా కలకాలం చరిత్రలో నిలిచిపోతాడు 'రాయలు'.

1 comment:

రాధిక said...

nijamaa?assalu teleedandi.inta manchi info ichinanduku dhanyavaadamulu.