"చనిన నాళుల తెనుగు కత్తులు
సానవెట్టిన బండ, ఈ పెనుగొండ కొండ" .
"రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన
ఆంధ్ర,కన్నడ రాజ్యలక్ష్ముల కరితి నీలపు దండ,ఈ పెనుగొండ కొండ '.
"వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ,ఈ పెనుగొండ కొండ".
"తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు
నిరుపమ ద్రాక్షారసంబులునిండి తొలికెడు కుండ,ఈ పెనుగొండ కొండ".
- శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు
1 comment:
The same poem in Rallapalli's handwriting in below link.
https://b8f2471b-a-62cb3a1a-s-sites.googlegroups.com/site/rallapallisharma/Home/major-accomplishments/Image026a.jpg?attachauth=ANoY7cpG2EXoIx8kNygkSDOFf3S_t8_siJDOg7NI9-tInChmLJk2pkN3L5Pb4tRbA2zNjCTXIgwLx4POxD-YQ6AoWWizB_PfTXg2b_76D19SQixrEetAplHTweg8uJmbx8FeViZzoiGbvfmEe_Wlrw4paceM-2ODDIxVzpeqejgInAyE-YImpeblAVh8GE1H0PX94R7V5uyR5iBUPuNEh4wZv0ueE3r6R7uSVuvc2bL598yXGQsq2J-1Pl1zAusokjbP6tIuMXvC&attredirects=0
Post a Comment